కార్తి ‘సర్దార్ 2’ షూటింగ్‌లో ప్రమాదం..

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం సర్దార్ 2. పీఎస్‌ మిత్రన్ దర్శకత్వంలో గతంలో వచ్చిన సర్దార్ సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఇటీవలే చెన్నైలో పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాను పట్టాలెక్కించారు. జులై 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించారు. అయితే ఈ సినిమా షూటింగ్ లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ లో జరిగిన ఒక ప్రమాదం కారణంగా ప్రముఖ ఫైట్ మాస్టర్ కన్నుమూసినట్లు తెలుస్తోంది.