త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే!

ట్రాఫిక్‌ రద్దీ, వాతావరణ కాలుష్యం లేకుండా తక్కువ ఎత్తులో పర్యావరణహిత ప్రయాణ సేవలు అందించేందుకు బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ సిద్ధమైంది. త్వరలోనే నగరంలో ఎగిరే ట్యాక్సీలు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీని కోసం సార్లా ఏవియేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని కంపెనీ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించింది.