“సెన్సార్ బోర్డు నా సినిమాను చంపేసింది”.. హీరో దర్శకుడి ఆవేదన - Tv9

బాలీవుడ్ లో గత ఏడాది కాస్త పర్లేదు అనే చెప్పాలి.. అంతకు ముందు వరుసగా డిజాస్టర్స్ తో సతమతం అయినా హిందీ ఇండస్ట్రీ 2023 లో మంచి హిట్స్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ రీసెంట్ గా వచ్చిన డంకి సినిమాలు బాలీవుడ్ ను బాగానే ఆదుకున్నాయి. అయితే సెన్సార్ బోర్డు కారణంగా తన సినిమా నాశనం అయ్యిందని అంటున్నారు అక్షయ్ కుమార్ దర్శకుడు. తన కథను సెన్సార్ బోర్డు చంపేసింది ఆరోపించారు ఆయన.