బిగ్ బాస్ సీజన్ 8 డేట్ ఫిక్స్...!

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సంద‌డి మ‌ళ్లీ షురూ కానుంది. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో తర్వాతి సీజన్ ను ప్రారంభించేందుకు స్టార్ మా రెడీ అవుతోంది. గత సీజన్లను మించి ఉండేలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ సీజన్ 8ను ప్రారంభించేందుకు చకా చకా ఏర్పాట్లు చేస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబ‌ర్ 1 లేదా 8వ తేదీ నుంచి ఈ బుల్లితెర రియాలిటీ షోను ఆఫీషియ‌ల్‌గా లాంఛ్ చేసే ఆలోచనలో మా ఉన్నట్టు ఓ న్యూస్ బయటికి వచ్చింది.