డంబ్ బాంబ్స్ విషయంలో అంచనా వేసిన అమెరికా నిఘా సంస్థ - Tv9

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధంతో గాజా వాసులు విలవిల్లాడిపోతున్నారు. దక్షిణ గాజాలో కూడా ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపిస్తుండటంతో ఇప్పుడు అక్కడి ప్రజలకూ సురక్షిత స్థానమంటూ లేకుండా పోయింది. ఫలితంగా వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. కచ్చితత్వం లేని ‘డంబ్‌ బాంబు’లను అధికంగా వాడటం కూడా ఇందుకు కారణం కావొచ్చని అమెరికా నిఘా సంస్థ నివేదిక అంచనా వేసింది. దీనిని నేషనల్ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్ కార్యాలయం రూపొందించిందని సీఎన్‌ఎన్‌ కథనంలో పేర్కొంది.