పల్లవి ప్రశాంత్ అరెస్టుపై పోలీసులు స్పందించారు. త్వరలో బిగ్‌బాస్ నిర్వాహకులను కూడా ప్రశ్నిస్తామన్నారు. పల్లవి ప్రశాంత్ కావాలనే.. అక్కడున్న యువకులను రెచ్చగొట్టాడని మరోసారి స్పష్టం చేశారు డీసీపీ విజయ్. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పల్లవి ప్రశాంత్‌ను వేరే దారిలో పంపించామని.. పాపులారిటీ కోసమే.. మళ్లీ వచ్చి అక్కడివారిని రెచ్చగొట్టాడని చెప్పారు డీసీపీ.