నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్‌జాం తుపాను తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది. ఆదివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో నగరం మొత్తం జలమయం అయింది. స్కూళ్లు, కార్యాలయాలు మూసివేశారు. పలు విమాన సర్వీసులు నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీవర్షాలతో ఇళ్లు, కాలనీలు నీటమునిగాయి. పార్క్ చేసిన వాహనాలు వరదనీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. చెన్నై ఎయిర్‌పోర్ట్ సైతం నీట మునిగింది. కోయంబత్తూరు- చెన్నై మధ్యలో రెండు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది.