మావా ఎంతైనా పర్లేదు బిల్లు.. వేస్ కో.. Mawaa Enthaina Lyrical Song From Guntur Kaaram Movie -Tv9

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా కోసం వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలా కాలం తర్వాత మహేష్ సరికొత్తగా మాస్ యాక్షన్ హీరోగా కనిపిస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ తో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇక ఈ క్రమంలోనే గుంటూరులో జరిగిని గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో... మరో కొత్త సాంగ్‌ను రిలీజ్ చేశారు తమన్. రిలీజ్ చేయడమే కాదు.. ఆ సాంగ్‌తో అందర్నీ మరో సారి ఆకట్టుకున్నాడు.