అయ్యప్ప దర్శనానికి అంతా రెడీ - Tv9

కేరళలో శబరిమల ఆలయం తెరుచుకుంది. నేటి నుంచి శబరిమలలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అయ్యప్ప దర్శనం కోసం భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. డిసెంబర్‌ 27న మండల పూజ, డిసెంబర్‌ 31 నుంచి జనవరి 15 వరకు మకరజ్యోతి పూజలు జరగనున్నాయి. జనవరి 15న సాయంత్రం మకరజ్యోతి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు అయ్యప్ప ఆలయాన్ని మూసివేస్తారు.