గడ్డకట్టిన జలపాతంలో ఆటలు.. అంతలోనే షాకింగ్ ఘటన

కొంత మంది గడ్డ కట్టిన జలపాతం కింద నిలబడి ఉన్నారు. అయితే ఇంతలో అకస్మాత్తుగా వారిపై భారీ ఐస్‌ గడ్డ విరిగి పడింది. షాకింగ్‌కి గురి చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జనవరి 5 న చైనాలోని జియాన్, షాంగ్సీ, హిషాంచ జలపాతం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఘనీభవించిన జలపాతం కింద సరదాగా గడుపుతున్న పర్యాటకులపై అకస్మాత్తుగా టన్ను బరువున్న భారీ ఐస్ ఫలకం జారి పడింది. ఆనందంగా ఆడుకుంటున్న సమయంలో రెప్పపాటులో ఈ ప్రమాదం జరిగింది.