బోరు నుంచి గులాబీ రంగు నీళ్లు.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న స్థానికులు
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో వింత చోటు చేసుకుంది. కొత్తగూడెం కాలనీలో ఓ ఇంటిలోని బోరుబావిలో గులాబీ రంగులో నీరు వస్తోంది. కట్ట శ్రీనివాస చారి అనే వ్యక్తి ఇంటిలో చోటు చేసుకుందీ ఘటన.