హద్దులు దాటుతున్న హీరో అభిమానులు.. బుద్ది చెబుతున్న పోలీసులు

హత్యానేరంపై నటుడు దర్శన్‌ అరెస్ట్‌ తర్వాత ఆయన అభిమానులు కొందరు అతిగా స్పందిస్తున్నారు. విమర్శల పాలవుతున్నారు. జైల్లో దర్శన్ కు ఇచ్చిన ఖైదీ నంబర్ ను అభిమానులు టాటూలుగా వేసుకుంటూ గర్వంగా చూపించుకుంటున్నారు. మరో అభిమాని చిన్నారి డ్రెస్ పై ఖైదీ నెంబర్ వేసి ఫోటో షూట్ చేశాడు. అలాగే 6106 నెంబర్ ను తమ వాహనాలకు నంబర్ ప్లేట్లుగా తగిలించుకుంటున్నారు. ఇప్పుడు మైసూర్‌కి చెందిన ఒక అభిమాని మరీ రెచ్చిపోయాడు.