హీరోయిన్ వచ్చిందని బస్టాండ్ ను మూసేసిన ఆర్టీసీ అధికారులు ..

హీరోయిన్ వచ్చిందని బస్టాండ్ ను మూసేసిన ఆర్టీసీ అధికారులు .. కడప జిల్లా మైదుకూరు పట్టణంలో ఆర్టీసి బస్టాండ్ పక్కన ఓ బట్టల షాపు ప్రారంభోత్సవం సందర్భంగా మాజీ జబర్దస్త్ యాంకర్, సినీతార అనసూయ మైదుకూరుకు వచ్చింది. దీంతో ఆర్టీసీ అధికారులు బస్టాండ్ మెయిన్ ద్వారాన్ని మూసివేశారు. ఆ షాపు బస్టాండ్ కు పక్కనే ఉండడం అనసూయ వస్తుండడంతో అక్కడకు చాలామంది స్థానిక ప్రజలు చేరుకోవడం, వారంతా వారి వాహనాల పార్కింగ్ ను బస్టాండ్ లో పెట్టి అక్కడికి చేరుకోవడంతో బస్టాండ్ లోనికి రానివ్వకుండా బారికెట్లను పెట్టారు ... అయితే దానివల్ల బస్సులు కూడా లోపలికి రావటం ఆగిపోయాయి. ఆర్టీసీ అధికారులు ఒకందుకు చేస్తే అది తీరా వారి మెడకే చుట్టుకుంది. ప్రయాణికులు, విద్యార్థులు నానా అవస్థలు పడ్డారు లోనికి వచ్చిన బస్సులు బయటకి పోవడానికి లేకుండా.. బయట ఉన్న బస్సులు లోనికి రావడానికి లేకుండా బారికేట్లను ఏర్పాటు చేయడం వల్ల ఎక్కడి ప్రయాణికులు అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో ఆర్టీసీ అధికారుల తీరుపై ప్రయాణికులు మండిపడ్డారు.