ఇక నుంచి అలా ఔటయితే నాటౌట్ ! - Tv9

క్రికెట్‌లో వికెట్‌ కీపర్‌ చేసే స్టంపింగ్‌ అప్పీల్స్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఇది బ్యాటర్లకు మేలు చేసేదే కాగా ఫీల్డింగ్‌ చేసే జట్టుకు మాత్రం నిరాశను కలిగించేదిగా ఉంది. ఇకనుంచి స్టంపౌట్‌లలో ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌ థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేస్తే.. టీవీ అంపైర్‌, స్టంపౌట్‌ మాత్రమే చెక్‌ చేయాలనే విధంగా నిబంధనలను సవరించారు. ఇంతకుముందు ఒక బ్యాటర్‌ను స్టంపౌట్‌ చేసినప్పుడు ఫీల్డింగ్‌ టీమ్‌ ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌కు అప్పీల్‌ చేస్తే ఒకవేళ ఆ బ్యాటర్‌గానీ, అతడి కాలు, బ్యాట్‌ గానీ క్రీజుకు సమీపంగా ఉంటే ఆయన థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేసేవాడు.