రావడం కాస్త లేటవ్వచ్చేమో కానీ.. రావడం మాత్రం పక్కా.. ఈ డైలాగ్ గుర్తుందా.. ఇది ఇప్పుడు మెగా ఫ్యామెలీకి పెర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఎప్పుడో 80వ దశకంలో మెగాస్టార్‌తో మొదలైన కొణిదెల ఫ్యామెలీ వెండితెర ప్రయాణం దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా కొనసాగుతునే ఉంది. చిరంజీవి తర్వాత ఒక్కొక్కరుగా వాళ్ల ఫ్యామెలీ మెంబర్స్ మూవీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ వచ్చారు. చిరు తర్వాత నాగబాబు నటుడిగా, నిర్మాతగా కెరీర్ కొనసాగించగా.. ఆ తర్వాత వచ్చిన పవన్ కల్యాణ్.. పవర్ స్టార్‌గా ఇండస్ట్రీని శాసిస్తూ వస్తున్నారు.