శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా నిపుణుల సలహా ఏమిటి

చలికాలంలో చల్లటి వాతావరణం కారణంగా చాలా మంది ఈ సీజన్‌లో సీజనల్ ఫ్రూట్స్ అయిన నారింజలను తినడానికి వెనుకాడతారు. నారింజ పండ్లను తింటే జలుబు, ఫ్లూ వస్తాయని భయపడుతుంటారు. నిజానికి, ఈ పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో దీనిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే నారింజ పండును తప్పనిసరిగా ఈ కాలంలో తినాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.