మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల నివాసంలో టాలీవుడ్ హీరోలు సందడి చేశారు. దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన విందుకు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. రామ్ చరణ్ కూతురు క్లింకారాకు తొలి దీపావళి పండుగ కావడంతో మెగా హీరో గ్రాండ్ పార్టీ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. శనివారం రాత్రి హైదరాబాద్ లోని తమ నివాసంలో రామ్ చరణ్ దంపతులు ఏర్పాటు చేసిన ఈ విందుకు విక్టరీ వెంకటేశ్, మహేశ్ బాబు- నమ్రత, ఎన్టీఆర్-ప్రణతి హాజరయ్యారు.