ఓ సినిమా బజ్‌ను డిసైడ్ చేసేది ఆ సినిమాకు సంబంధించిన టీజర్ అండ్ ట్రైలరే! అవి పర్ఫెక్ట్గా ఉంటే చాలా.. జనాలను ఆకట్టుకుంటే చాలు.. సినిమాను రిప్లెక్ట్ చేస్తే చాలు.. ఎమోషనల్లీ కనెక్ట్ చేస్తే చాలు.. ఆ సినిమా టాక్ ఏంటో ముందుగానే తెలిసిపోతుంది. ఆ సినిమా పై ఎక్కడ లేని అంచనాలను పెంచేస్తుంది. ఇక తాజాగా యాత్ర 2 విషయంలోనూ అదే జరుగుతోంది. హను వి డైరెక్షన్లో... జీవ చేసిన రియల్ ఇన్సిడెంట్ పొలిటికల్ బేస్డ్ ఫిల్మ్ యాత్ర 2. యాత్ర 1కు కంటిన్యూగా... తెరకెక్కిన ఈసినిమా టీజర్ తాజాగా రిలీజ్ అయింది. అందర్నీ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేస్తోంది. అందులోనూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మరో సారి అందరూ గుర్తుకు తెచ్చుకునేలా చేస్తోంది.