సలార్ సినిమా ఎట్టకేలకు విడుదలైంది. ప్రేక్షకులు ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూసిన సలార్ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన అన్ని ఏరియాల్లో అభిమానులు సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టికెట్ బుకింగ్స్ తోనే రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి రోజు సలార్ సినిమాకు 150కోట్లకు పైగా వస్తాయని అంటున్నారు ఫ్యాన్స్. ఓవర్ ఆల్ గా ఈ సినిమా 1000కోట్లు దాటి వసూల్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈక్రమంలోనే ఈ మూవీ ఓటీటీకి సంబంధించిన న్యూస్ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.