నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌

భారత్‌తో ఉన్న భూవివాదాన్ని నేపాల్‌ సెంట్రల్‌ బ్యాంక్ మరింత రాజేసింది. వివాదాస్పద భూభాగాలుగా ఉన్న లిపులేక్‌, కాలాపానీ, లింపియాదూర ప్రాంతాలను తమవిగా చెప్పుకుంది. నేపాల్‌ రాష్ట్ర బ్యాంక్‌ ముద్రించే కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌లను కూడా జత చేసింది. నేపాల్‌ ప్రధాని దహల్‌ మంత్రివర్గం ఈ వివాదాస్పద మ్యాప్‌తో నోట్లను ముద్రించాలని మే 3వ తేదీన నిర్ణయించింది.