అవును...నా కాబోయే భర్తకు ఆల్రెడీ పెళ్లయ్యింది... అయితే ఏంటి - Tv9

వరలక్ష్మీ శరత్‌ కుమార్‌.. తమిళ నటే అయినప్పటికీ తెలుగులోనూ పలు బ్లాక్ బస్టర్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుస విజయాలతో టాలీవుడ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ యాక్టర్‌గా మారిపోయారు. గ్లామర్ పాత్రలు చేయకపోయినా పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే వాటిని క్రమం తప్పకుండా దక్కించుకుంటున్న ఈ కోలీవుడ్ ఆర్టిస్ట్ నటించిన శబరి చిత్రం ఇటీవలే రిలీజ్‌ అయింది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియాకు ఇంటర్వ్యూలో వరలక్ష్మీ తన కాబోయే భర్తగురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.