బూడిద గుమ్మడిలో మన శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉన్నాయని పోషకాహర నిపుణులు చెబుతున్నారు. తరచుగా బూడిద గుమ్మడి కాయతో చేసిన వంటకాలు తినడం వల్ల చాలా ఆరోగ్యప్రయోజనాలున్నాయని సూచిస్తున్నారు. బూడిద గుమ్మడితో చేసిన జ్యూస్ క్రమం తప్పకుండా పరగడపునే తాగడం వల్ల అది శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపించేస్తుంది. ఇది శరీరం లో చెడు కొలెస్ట్రాల్ చేరనీయకుండా కాపాడుతుంది.