పాములు పగపడతాయా లేదా అన్న విషయం పక్కన పెడితే.. ఓ వ్యక్తిని పాములు వెంటాడి మరీ కాటు వేస్తున్నాయి. పాములనుంచి తప్పించుకోడానికి ఊరు వదిలి వెళ్లిపోయినా అక్కడ కూడా పాములు అతన్ని వదల్లేదు. ఎక్కడికి వెళ్లినా పాములు తరచూ కాటు వేస్తుండటంతో తిరిగి స్వగ్రామానికి చేరుకుని కాటు వేసిన ప్రతిసారీ వైద్యం చేయించుకొని బయటపడుతున్నాడు సుబ్రహ్మణ్యం.. ఇంతకీ ఎవరీ సుబ్రహ్మణ్యం.. అతన్ని పాములు ఎందుకు కాటువేస్తున్నాయి?