సోషల్ మీడియాలో చిత్ర విచిత్రమైన వార్తలు వైరల్ అవుతుంటాయి. అలాంటిదే తాజాగా మరో వింత వార్త వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి వాక్‌వేలో ఆరేసిన మహిళల దుస్తులను దొంగిలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి చాలా రోజులుగా మహిళల బట్టలు దొంగిలిస్తున్నాడు. తరచూ బట్టలు మాయం కావడం గమనించిన ఆ మహిళ అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి ఒక పథకం వేసింది. ఆమె వేసిన స్కెచ్ లో అడ్డంగా బుక్కయ్యాడు సదరు దొంగోడు. యథావిధిగా అతడు ఆమె లోదుస్తులను దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. సింగపూర్‌కు చెందిన ఫేస్‌బుక్ యూజర్ ఆల్వీ లిమ్ ఈ వీడియోను షేర్ చేసింది. ఈ సంఘటన తనకు అసహ్యం కలిగించిందంటూ రాసుకొచ్చింది.