సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను టార్గెట్ చేస్తూ వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం కాకులగుట్ట తండాకు చెందిన సంతోష్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఆర్బీఐ అధికారులం అంటూ నమ్మించాడు. క్రెడిట్ కార్డ్ ఇయర్లీ చార్జ్ పే చేయాలని చెప్పాడు. సంతోష్ వాట్సప్ నెంబర్‌కు లింక్ పంపాడు. సంతోష్ లింక్ ఓపెన్ చేయగానే అతని SBI క్రెడిట్ కార్డ్ నుంచి 67 వేల 700 రూపాయల నగదు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది.