భారతీయ రైల్వే ముఖ చిత్రం క్రమంగా మారుతోంది. వేగంతో పాటు సకల సౌకర్యాలతో కూడిన ప్రయాణాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకువెళుతోంది. ఇందులో భాగంగానే దేశంలో వందే భారత్ రైళ్లను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇండియన్ రైల్వేస్‌లో సరికొత్త అధ్యయనానికి తెర తీసిన ఈ రైళ్లకు ప్రజల నుంచి కూడా భారీగా ఆదరణ లభించింది. తాజాగా భారత్‌లో మరో కొత్త తరహా రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.