గుమ్మడి, నిమ్మ, కొబ్బరికాయలతో అమ్మవారికి సాత్విక బలి.. శ్రీశైలంలో కన్నుల పండగ!

అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో శ్రీ భ్రమరాంబికాదేవి వార్షిక కుంభోత్సవం ఘనంగా జరిగింది. తరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం అర్చకులు ఏకాంతంగా ఈ పూజలన్ని నిర్వహించిన తర్వాత అమ్మవారికి మొదటి విడత సాత్వికబలిగా వందల సంఖ్యలో గుమ్మడి కాయలు, కొబ్బరికాయలలు, నిమ్మకాయలను ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు, అర్చకులు సమర్పించారు.