ఢిల్లీలోని ఎయిమ్స్ టాపర్ ఒకరు డాక్టర్ అయిన తన స్నేహితురాలిని పెళ్లి చేసుకునేందుకు రూ. 50 కోట్ల కట్నం డిమాండ్ చేసినట్టు బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఆరోపిస్తూ ఎక్స్‌లో ఈ విషయాన్ని షేర్ చేసింది. కట్నం డిమాండ్ చేసినప్పటి నుంచి తన స్నేహితురాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ రోజుల్లో కూడా కట్నం ఎంత మూమూలు విషయంగా ప్రబలిపోయిందో ఈ ఘటన మనకు చెబుతోందని ఆమె విచారం వ్యక్తం చేసింది.