వారణాసిలో ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ రివీల్.. మంచి ఛాన్స్ కొట్టేశాడుగా

రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' (SSMB29)లో ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మహేష్‌తో ఆయనది హిట్ కాంబినేషన్ కాగా, 20 ఏళ్ల తర్వాత రాజమౌళితో తిరిగి పనిచేస్తున్నారు. సినిమాలో ప్రకాశ్ రాజ్ శివభక్తుడిగా నటిస్తున్నారని, ఇప్పటికే 50% షూటింగ్ పూర్తైందని ఆయన వెల్లడించారు. ఈ ప్రత్యేక కలయిక సినిమాపై అంచనాలను భారీగా పెంచుతోంది.