అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్!.. బాలరాముడి దర్శనం కావాలంటే..

అయోధ్యలో బాలరాముడు కొలువు తీరి ఏడాది పూర్తి కావస్తోంది. జనవరి 22, 2024న కోట్లాది భక్తుల కలలు నెరవేరుస్తూ అయోధ్యలో కొలువుతీరాడు. అసాధ్యం అనుకున్న రామాలయ నిర్మాణాన్ని చేపట్టి టెంట్‌లో ఉన్న బాలరాముడిని గర్భగుడిలో ప్రవేశ పెట్టారు భారత ప్రధాని నరేంద్రమోదీ. అశేష భక్తుల కన్నుల పండువగా రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది.