Third Most Expensive Penthouse In World Sold For Rs 1133 Crore In Dubai -Tv9

దుబాయ్‌లో ఓ పెంట్‌ హౌస్‌ రూ 1,133 కోట్లకు అమ్ముడుపోయింది. అత్యంత ఖరీదైన పామ్‌ జుమెరియా ప్రాంతంలో కడుతున్న కోమో రెసిడెన్సెస్‌ అనే 71 అంతస్తుల ఆకాశహర్మ్యంపై ఈ పెంట్‌ హౌస్‌ రానుంది. ఓ అజ్ఞాత కుబేరుడు దీన్ని ఏకంగా రూ.1,133 కోట్లకు కొన్నాడు! ఈ ఐదు పడకగదుల పెంట్‌ హౌస్‌ విస్తీర్ణం 22 వేల చదరపు అడుగులు. ప్రపంచ రియల్టీ మార్కెట్లో అత్యంత ఎక్కువ ధర పలికిన మూడో పెంట్‌ హౌస్‌గా ఇది కొత్త రికార్డు సృష్టించింది.