బాలీవుడ్‌లో స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అద్భుతమైన డాన్స్ తో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ‘కహో నా ప్యార్ హై’ సినిమాతో అరంగేట్రం చేసిన హృతిక్.. ఒకదాని తర్వాత ఒకటి హిట్ చిత్రాలలో నటించి తక్కువ సమయంలోనే మంచి పేరు తెచుకున్నాడు. బాలీవుడ్‌లో గ్రీకు దేవుడి అంటూ ఆయనను పిలుస్తూ ఉంటారు. హృతిక్ తన తండ్రి, నటుడు-దర్శకుడు రాకేష్ రోషన్ తో కలిసి కహో నా ప్యార్ హైతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ సినిమాల తర్వాత తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.