ఎయిర్ ఇండియా విమానంలో భారీ శబ్దం.. వెంటనే ల్యాండ్ చేసిన పైలట్ - Tv9

టేకాఫ్‌ అయిన విమానంలో ఒక్కసారిగా భారీ శబ్దం వెలువడింది. ఆ శబ్దానికి విమానంలో ఉన్న ప్రయాణికులంతా తీవ్ర భయాందోళన చెందారు. అప్రమత్తమైన పైలట్లు వెంటనే విమానాన్ని టేకాఫ్ అయిన చోటే ల్యాండ్‌ చేశారు. శనివారం సాయంత్రం నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి ఢిల్లీ రావాల్సిన ఎయిరిండియా విమానాన్ని టేకాఫ్ తీసుకున్న తర్వాత, తిరిగి అదే ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమానాన్ని అక్కడే ల్యాండ్‌ చేయాల్సి వచ్చిందని అధికారులు ప్రకటించారు.