శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం దేవస్థానంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గోవిందా గోవిందా అంటూ భక్తులు భోజనం చేసిన విస్తరాకులను ఎత్తారు CWC మెంబర్ రఘువీరారెడ్డి. నీలకంఠాపురం గ్రామ దేవస్థానములో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్టి పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు రఘువీరారెడ్డి. ఉదయం నుండి ఆలయ ప్రాంగణంలో ప్రధాన అర్చకులు విశిష్ట పూజలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా బ్రాహ్మణులకు ఏర్పాటుచేసిన భోజన కార్యక్రమంలో వారు భోంచేసిన ఎంగిలి ఆకులను రఘువీరా దంపతులు ఎత్తారు. ఇలా చేయడం వల్ల మహా పుణ్యం అంటూ ఇక్కడి జనం చర్చించుకున్నారు.