విమాన ప్రయాణంలో కొందరు ప్రయాణికుల అనుచిత ప్రవర్తన శ్రుతి మించుతోంది. కొందరు ప్రయాణికులు మద్యం మత్తులో తోటి ప్రయాణికులను దుర్భాషలాడటం, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడులకు పాల్పడటం ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇండిగో ఫ్లైట్‌లో ఓ 32 ఏళ్ల ప్రయాణికుడూ ఇలాగే చేశాడు.