చెన్నైలోని చాలా ప్రాంతాల్లో 15 సెం.మీ కంటే ఎక్కవ వర్షపాతం నమోదు అయింది. చాలా ప్రాంతాల్లో వరద నీరు ఇళ్ళలోకి చేరింది. చెన్నై శివారులోని సత్యభామ ఇంజనీరింగ్ కాలేజీలోకి భారీగా వరదనీరు చేరింది. దీంతో విద్యార్థుల పరిస్థితి వర్ణణాతీతంగా మారింది. కొందరు స్టూడెంట్స్ బోట్స్ సాయంతో కాలేజీ హాస్టల్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.