నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను తెలుగు సినీ నటుడు హీరో సాయి ధర్మతేజ్ దర్శించుకున్నారు ఆలయ రాజగోపురం వద్ద ఆలయం మర్యాదలతో అర్చకులు,అధికారులు సినీ హీరో సాయి ధర్మతేజకు స్వాగతం పలికారు మల్లన్న సన్నిధికి వచ్చి శ్రీస్వామి అమ్మవార్ల ఆశీస్సులను పొందేందుకు శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకుని మల్లన్నకు అభిషేకాలను అమ్మవారికి కుంకుమార్చన పూజలను నిర్వహించుకున్నారు అమ్మవారి ఆలయ ముఖ మండపం వద్ద వేద పండితుల ఆశీర్వచనాలను లడ్డు ప్రసాదాలను స్వీకరించారు సినీహీరో సాయి ధర్మతేజ వస్తుండటంతో ఉమ్మడి కర్నూలు జిల్లా నాయకుడు మంజునాథ్,శ్రీశైలం జనసేన అశోక్ ఘన స్వాగతం పలికారు దర్శనంతరం పలువురు అభిమానులు ఫోటోలు దిగారు....