ఆంధ్రప్రదేశ్ కు తుపాను రూపంలో మరో ముప్పు పొంచి ఉందా? ...తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉందా..? అంటే అవుననే అంటోంది వాతావరణ శాఖ. మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో పంటలు దెబ్బతిని.. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరద బాధితులను ఆదుకోవడంతో పాటు.. పంట నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేస్తుండగానే.. గండం మరో తుఫాన్ రూపంలో ముంచుకొస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వార్నింగ్ బెల్స్ రైతులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.