మీరు కొన్న గోల్డ్ స్వచ్ఛమైందేనా.. ఇలా తెలుసుకోండి..! - Tv9

దసరా, దీపావళికి కొత్త వస్తువులు కొనే సెంటిమెంట్ చాలా మందికి ఉంటుంది. అయితే కేవలం ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌, గృహోపకరణాలు మాత్రమే కాకుండా కొందరు బంగారం కూడా కొనుగోలు చేస్తుంటారు. బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో అసలు మనం కొనుగోలు చేస్తున్న బంగారం స్వచ్ఛమైందేనా అనే సందేహం రావడం సహజం. అయితే కేంద్ర ప్రభుత్వం హాల్‌ మార్క్‌ను తప్పనిసరి చేసిన తర్వాత బంగారం నాణ్యతపై కొనుగోలు దారులకు అవగాహన పెరుగుతోంది.