ప్రభాస్ ఎఫెక్ట్.. పుష్పకు కుప్పలుతెప్పలుగా డబ్బు Salaar Fetching Good Business For Pushpa 2 -Tv9

సలార్ దెబ్బతో పుష్ప 2 బిజినెస్ పెరుగుతుంది.. అల్లు అర్జున్ సినిమా బిజినెస్ ఆకాశమంత రేట్లకు పెరిగిపోయింది ఇప్పుడు. అదేంటి ప్రభాస్ సినిమా హిట్ అయితే అల్లు అర్జున్ సినిమాకు బిజినెస్ పెరగడం ఏంటి విచిత్రం కాకపోతే అనుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఇండస్ట్రీలో బటర్ ఫ్లై ఎఫెక్ట్ బాగా నడుస్తోంది. ఈ నేచర్‌లో ఎక్కడో జరిగే ఒక ఇన్సిడెంట్.. మరెక్కడో జరిగే ఇంకో ఇన్సిడెంట్‌కు లింక్ అయి ఉంటుంది అంటూ నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ చెప్పాడు కదా.. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఇదే జరుగుతోంది. ఇక్కడ ఒక పెద్ద సినిమా హిట్ అయి రికార్డు క్రియేట్ చేస్తే.. దాని తర్వాత అదే రేంజ్ ఉన్న పెద్ద సినిమా బిజినెస్‌పై చాలా ప్రభావం చూపిస్తుంది.