యాక్షన్ ఎపిసోడ్స్.. రిస్కీ స్టంట్స్ చేస్తున్నప్పుడు.. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. హీరోలు ప్రమాదానికి గురవుతుంటారు. గాయాల పాలవుతుంటారు. ఇప్పుడు నితిన్ కూడా.. అలాంటి పనే చేస్తూ.. గాయాలపాలయ్యారట. రీసెంట్‌గా... ఎక్స్ ఆర్డినరీ మ్యాన్ సినిమాతో.. తన ఫ్యాన్స్‌ను డిస్సపాయింట్ చేసిన నితిన్... నెక్ట్స్ ఎలాగైనా హిట్టు కొట్టాలని వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తమ్ముడు సినిమా చేస్తున్నారు. షూటింగ్‌లో తన బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే మారేడు మిల్లిలో జరగుతున్న ఈ మూవీ షూట్లో గాయపడ్డారట నితిన్.