సుప్రీంకోర్టులో బుధవారం అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. తనను అసహనానికి గురి చేసిన న్యాయవాదిపై సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గొంతు తగ్గించాలని హెచ్చరించారు. ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయవాది గట్టిగా మాట్లాడటంతో సీజేఐ అసహనానికి గురయ్యారు. న్యాయవాదితో.. సాధారణంగా మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు.. గొంతును పెంచడంద్వారా కోర్టును బెదిరించలేరు.. నా 23 ఏళ్ల కెరీర్‌లో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు.