సభ్య సమాజం తలదించుకునే ఘటన ఢిల్లీలో జరిగింది. ఓ ద్విచక్ర వాహనదారుడు ప్రమాదానికి గురై రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్నాడు. చుట్టూ ఉన్న జనం అతడిని ఆసుపత్రికి తరలించడమో, పోలీసులకు సమాచారం అందించడమో చేయకుండా చోద్యం చూస్తూ వీడియోలు తీశారు. అంతటితో ఆగలేదు. అతడి ‘గోప్రో’ను చోరీ చేసి తీసుకెళ్లిపోయారు. సౌత్ ఢిల్లీలో జరిగిందీ ఘటన.