లగ్జరీ కార్లకు ఉండే క్రేజే వేరు. వీటిని కొనుగోలు చేయడానికి సంపన్నులు పోటీ పడుతుంటారు. రూ.కోట్లు ఖర్చు పెట్టి మరీ ఇతర దేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకుంటారు. అలాంటి ఓ లగ్జరీ కారు తాజాగా మన దేశ రోడ్లపైకి వచ్చింది. భారత్‌లో మొట్టమొదటి ఆస్టన్ మార్టిన్ DB12 స్పోర్ట్స్ కారు ఇదేనట. దీని ధర కూడా నాలుగున్నర కోట్ల రూపాయల పైమాటే. అలాగని ఈ కారును కొన్నది ఏ అంబానీనో, అదానీనో కాదు.. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్.