అయ్యప్పస్వామి దీక్ష అంటే చాలా కష్టమైనదనే చెప్పాలి. మండలం రోజులపాటు నియమ నిష్టలతో స్వామివారిని పూజించాలి, భజనలు చేయాలి. అయినా చాలామంది భక్తులు స్వామి మాల ధరించి దీక్ష తీసుకుంటారు. మండలం రోజుల తర్వాత శబరిమలకు వెళ్లి స్వామి దర్శనంతో దీక్ష విరమిస్తారు. ఇది సామాన్యులకే కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటిది నిత్యం ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ప్రజాసమస్యలు పరిష్కారం ఇలా రకరకాల పనులతో సతమతమయ్యే జిల్లా కలెక్టర్ అయ్యప్పమాల ధరించారు.