దేశ భద్రత విషయంలో కేంద్రప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో నిఘావ్యవస్థను మరింత పటిష్టం చేస్తోంది. ఇటీవల చైనా, పాకిస్థాన్ చర్యల దృష్ట్యా ఆ దేశాల కదలికలపై ప్రత్యేక నిఘా అవసరమని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టే యోచనలో ఉంది.