మహమ్మారిలా మారిన గుండెపోటు మరో వ్యక్తిపై ఎటాక్ చేసింది. అయితే ఈసారి అతని ప్రాణాలు తీసుకోలేకపోయింది. గంటపాటు గుండె ఆగిపోయిన వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు నాగ్‌పూర్ వైద్యులు. అనంతరం 45 రోజులు ఐసీయూలో ఉంచి చికిత్స చేశారు. పూర్తిగా కోలుకున్న ఆ వ్యక్తిని అక్టోబరు 13న ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ చేశారు. పేషెంట్‌కు అత్యవసరంగా వైద్యం అందించాల్సి రావడంతో సీపీఆర్ వివరాలు నమోదుచేయలేకపోయామన్నారు వైద్యులు.