రోగి అనుమతిస్తేనే ఐసీయూకు.. - Tv9

ఇటీవల కాలంలో రోగులను ఐసీయూలో ఉంచి చికిత్స చేయడం బాగా పెరిగిపోయింది. ఎలాంటి అనారోగ్యమైనా ముందు ఐసీయూలోకి తరలిస్తున్నారు. దీనికి చెక్‌ పెడుతూ కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రోగులను ఐసీయూలో చేర్చుకోవడంపై 24 మంది నిపుణుల బృందం ఈ మార్గదర్శకాలను రూపొందించినట్టు తెలిపింది. రోగి నిరాకరిస్తే ఆసుపత్రి యాజమాన్యాలు ఐసీయూలో చేర్చుకోవడానికి వీల్లేదని కేంద్రం స్పష్టం చేసింది. పేషెంట్ బంధువులు అభ్యంతరం తెలిపినా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని తెలిపింది.