Israel Palestine Conflict 7 వేలకు పైగా మిలిటెంట్లు హతం - Tv9

ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది..ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులతో పాలస్తీనా గజగజ వణికిపోతోంది..ఖాన్‌ యూనిస్‌ నగరం బాంబులు, కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. ఇప్పటివరకు 7 వేల మందికిపైగా హమాస్‌ మిలిటెంట్లను హతమార్చింది ఇజ్రాయెల్‌.. గాజా నగరం శవాలదిబ్బగా మారిపోతోంది..గాజాలో ఇప్పటివరకు 17వేల మందికి పైగా మరణించారు. అదే సమయంలో 46 వేల మందికి పైగా గాయపడ్డారు.. గాజాలో ఆహారం, నీరు, నిత్యావసరాల కొరత తీవ్రంగా ఉంది. మానవతా సాయం అందక గాజా జనాభాలో 90 శాతం మంది ప్రతిరోజు తిండి తినలేకపోతున్నారు.హమాస్‌ను పూర్తిగా నాశనం చేసే వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు.