ఇప్పుడంటే అలారమ్స్ వచ్చాయి గానీ.. పూర్వం నిద్రలేవాలంటే కోడి కూయాల్సిందే. కోడిపుంజు కూత వినపడిందంటే నిద్ర లేచే యాల్ల అయిందని లెక్క. కోడికూసుడుతోనే రైతులు నిద్రలేచి వ్యవసాయ పనులు మొదలు పెడతారు. మనిషి జీవన విధానంలో కోడికూత అనేది ఓ భాగం అయిపోయింది. ఈ నేపథ్యంలో కోడి ఉదయాన్నే ఎందుకు కూస్తుంది. అసలు సూర్యోదయం అయినట్లు కోళ్లకు అంత కచ్చితంగా ఎలా తెలుస్తుంది..